Harassing Tribal Woman: ఉద్యోగం నుంచి పట్నం ఎస్‌ఐ తొలగింపు
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:43 AM
గిరిజన మహిళను లైంగికంగా వేధించినందుకు శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం పట్నం ఎస్‌ఐ రాజశేఖర్ ఉ..
గిరిజన మహిళను లైంగికంగా వేధించిన ఫలితం
పుట్టపర్తి రూరల్, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): గిరిజన మహిళను లైంగికంగా వేధించినందుకు శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం పట్నం ఎస్‌ఐ రాజశేఖర్ ఉద్యోగాన్ని కోల్పోయారు. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన ముదిగుబ్బ మండలం గరుగుతండాకు చెందిన మహిళను ఆయన లైంగికంగా వేధించారు. రాత్రిళ్లు న్యూడ్ వీడియో కాల్స్ చేశారు. ఈ వీడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఎస్పీ వి.రత్న సమగ్ర విచారణకు ఆదేశించారు. మూడు రోజుల క్రితం ఆయనను వీఆర్‌కు పంపారు. వేధింపులు నిజమేనని విచారణలో తేలడంతో ఉద్యోగం నుంచి తొలగిస్తూ కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.