ప్రభుత్వాస్పత్రిలో రోగులకు మైరుగైన వైద్యమందించాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:53 PM
ప్రభుత్వ ఆసుప త్రికి వచ్చే రోగులను అప్యా యంగా పలుకరించి మెరుగైన వైద్యం అందించాలని మైదు కూరు ఎమ్మెల్యే పుట్టా సుధా కర్‌యాదవ్ సూచించారు.
మైదుకూరు రూరల్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి) :ప్రభుత్వ ఆసుప త్రికి వచ్చే రోగులను అప్యా యంగా పలుకరించి మెరుగైన వైద్యం అందించాలని మైదు కూరు ఎమ్మెల్యే పుట్టా సుధా కర్‌యాదవ్ సూచించారు. స్థాని క నంద్యాల రోడ్డులోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్‌యాదవ్ ఆకస్మిక తనిఖీలు చేసి ఆసుపత్రికి వచ్చే రోగులతో మాట్లాడారు. వైద్యులు కాని,సిబ్బంది వలన ఏమైనా ఇబ్బంది కలుగుతుందా అని అడిగి తెలుసుకున్నారు. రక్త పరీక్ష ల్యాబ్‌ను పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి పోలీస్ ఔట్‌పోస్ట్, పోస్ట్‌మార్టం, డయాలసిస్ మంజూరుకు కావలసిన ప్రతిపాదనలను వెంటనే తయారుచేయాలని డాక్టర్లను ఆదేశించారు. త్వరలో మైదు కూరులో వంద పడకల ఆసుపత్రి మంజూరుకు కృషి చేస్తున్నమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దాసరిబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఏపీ రవీంద్ర, మిల్లు శ్రీను, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్ మోపూరి రమణ, బండి అమర్‌నాధ్, తుపాకుల రమణ, రేనాడి వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు.