పదవులకు ఓపికే అర్హత
ABN , Publish Date - Aug 13 , 2025 | 11:33 PM
పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని, పదవులు దక్కాలంటే ఓపికగా ఉండటమే అర్హత అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
కర్నూలు అర్బన, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం ఉంటుందని, పదవులు దక్కాలంటే ఓపికగా ఉండటమే అర్హత అని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో కలిసి తిక్కారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ముందుగా రాష్ట్రస్థాయిలో పలు కార్పొరేషన్లకు చైర్మన పదవులు దక్కించుకున్న ఆకెపోగు ప్రభాకర్, పార్వతమ్మలను సత్కరించారు. అనంతరం తిక్కారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక పార్టీ కోసం కష్ట సమయాల్లో పని చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి న్యాయం చేస్తోందన్నారు. పులివెందుల, ఒట్టిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగాయన్నారు. కౌంటింగ్ కంటే ముందే వైసీపీ ఓటమిని అంగీకరించి, లేనిపోని ఆరోపణలు చేస్తోందన్నారు. కుడా చైర్మన సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పులివెందుల వైసీపీ నేత సతీష్ రెడ్డి అసత్య ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపడాన్ని పులివెందుల ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో బొందిలి అభివృద్ధి సంస్థ చైర్మనగా ఎంపికైన విక్రమ్ సింగ్, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు ధరూర్ జేమ్స్, వీటీ విజయ్‌కుమార్, నంద్యాల నాగేంద్ర, నాయకులు హనుమతరావు చౌదరి, సత్రం రామకృష్ణుడు, రమేష్‌రెడ్డి, పుల్లయ్యచౌదరి, పేరపోగు రాజు తదితరులు పాల్గొన్నారు.