Share News

దేశ సమగ్రాభివృద్ధికి బాటలు

ABN , Publish Date - Dec 13 , 2025 | 11:25 PM

దేశ సమగ్రాభివృద్ధికి భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి బాటలు వేశారని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు పీవీఎన మాధవ్‌ అన్నారు.

   దేశ సమగ్రాభివృద్ధికి బాటలు
విగ్రహావిష్కరణలో పాల్గొన్న, బీజేపీ రాష్ట్ర అఽధ్యక్షుడు మాధవ్‌, మంత్రులు, అభిరుచి తదితరులు

విలువలతో రాజకీయం చేసిన వ్యక్తి అటల్‌ బిహారీ

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన మాధవ్‌

హైవేల నిర్మాణానికి పునాది వేసిన వాజ్‌పేయి : మంత్రి సత్యకుమార్‌

ఫ నంద్యాలలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ

నంద్యాల నూనెపల్లి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): దేశ సమగ్రాభివృద్ధికి భారత రత్న, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి బాటలు వేశారని బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు పీవీఎన మాధవ్‌ అన్నారు. వాజ్‌పేయి శత జయంతిని పురస్కరించుకొని శని వారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వాస్పత్రి సమీపంలో ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆయనతో పాటు మం త్రులు సత్యకుమార్‌ యాదవ్‌, బీసీ జనార్దనరెడ్డి, ఎనఎండీ ఫరూక్‌ ముఖ్య అతి థులుగా పాల్గొన్నారు. ముందుగా వారు వాజ్‌పేయి విగ్రహావిష్కరించారు. అనంతరం జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాధవ్‌ మాట్లాడుతూ సిద్ధాంతాలు, విలువలతో రాజకీయం చేసిన అరుదైన మహనీయుడు వాజ్‌పేయి అన్నారు. శత్రుదేశంతో కూడా సంబంధం కలుపుకోవాలని, కుల, మత బేధాలు లేకుండా అందరం కలిసి ఉండాలని ముందుకెళ్లిన ఏకైక వ్యక్తి అటల్‌ మాత్రమేనన్నారు. మంత్రి సత్యకుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ దేశంలో మొట్టమొదట హైవే రోడ్లు నిర్మించిన వ్యక్తి వాజ్‌పేయి అన్నారు. మంత్రి బీసీ జనార్దనరెడ్డి మాట్లాడుతూ వాజ్‌పేయి దేశాభివృద్ధికి మూడుసార్లు ప్రధానిగా కీలక సేవలందిచారన్నారు. ఆయన విగ్రహ ఆవిష్కరణకు రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మంత్రి ఎనఎండీ ఫరూక్‌ మాట్లాడుతూ.. వాజ్‌పేయిది అందరినీ కలుపుకొని వెళ్లే వ్యక్తిత్వం కలిగిన నాయకుడని కొనియాడారు. ఆయనతో సంబంధం ఉన్నట్లు వివరించారు.హైవే లు, మౌలిక వసతుల అభివృద్ధితో దేశ రూపు రేఖలు మారాయన్నారు. అంతకుముందు బీజేపీ చేపట్టిన బైక్‌ ర్యాలీ అట్టహాసంగా జరిగింది. డప్పు వాయిద్యాల మధ్య చిన్నారుల కోలాటం, నృత్యాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేశనాయుడు, బీజేపీ రాయలసీమ జోనల్‌ ఇనచార్జి దయాకర్‌రెడ్డి, సీనియర్‌ నాయకులు విష్ణువర్ధనరెడ్డి, బుడ్డా శ్రీకాంతరెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Dec 13 , 2025 | 11:25 PM