Parvathipuram Manyam District: రబ్బరు డ్యాంలో ముగ్గురు గల్లంతు
ABN , Publish Date - Nov 24 , 2025 | 05:13 AM
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజలక్ష్మీపురం వద్దనున్న రబ్బరు డ్యాంలో ఆదివారం ముగ్గురు గల్లంతయ్యారు.
పార్వతీపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజలక్ష్మీపురం వద్దనున్న రబ్బరు డ్యాంలో ఆదివారం ముగ్గురు గల్లంతయ్యారు. కొమరాడ మండలం సివిని గ్రామానికి చెందిన అరసాడ ప్రదీప్, రాయగడ శరత్, అధికారి గోవిందనాయుడుతో పాటు మరికొందరు యువకులు పిక్నిక్ కోసం రబ్బరు డ్యాం వద్దకు వెళ్లారు. అక్కడ స్నానం కోసం నీటిలో దిగగా ముగ్గురూ ప్రవాహానికి కొట్టుకుపోయారు. వారి కోసం వెతికినా జాడ కనిపించలేదు. ప్రదీప్ ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. శరత్ పార్వతీపురంలోని ఆర్కే కాలేజ్‌లో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గోవిందనాయుడు తన గ్రామంలోనే వెల్డింగ్ షాప్ నిర్వహిస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.