విభజన హామీలను అమలు చేయాలి
ABN , Publish Date - Oct 16 , 2025 | 12:04 AM
విభజన సమయంలో రాష్ర్టానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు.
ప్రధాని గో బ్యాక్ అంటూ వామపక్షాల నిరసన
నాయకుల అరెస్ట్ .. పోలీస్‌స్టేషనకు తరలింపు
నంద్యాల రూరల్, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి) : విభజన సమయంలో రాష్ర్టానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రధాని గో బ్యాక్ అంటూ వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. పద్మావతి నగర్ ఆర్చీ నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ కొనసాగింది. గాంధీచౌక్‌లో వామపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మూడవ పట్టణ పోలీస్‌స్టేషనకు తరలించారు. సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామాంజనేయులు మాట్లాడుతూ విభజన సమయంలో ఇచ్చిన హామీల గురించి ప్రధాని మోదీతో మాట్లాడే ధైర్యం కూటమి ప్రభుత్వానికి లేదన్నారు. విభజన తర్వాత రాష్ర్టానికి ఏమి ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో మాయమాటలు చెప్పి ప్రజలను మోసగించడం మంచి పద్ధతి కాదన్నారు. ట్రంప్ విధానం వల్ల అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు భద్రత లేదని ఆవిషయంపై మోదీ ఎందుకు ప్రశ్నించడం లేదో చె ప్పాలన్నారు. సిద్దేశ్వర అలుగు నిర్మాణ పనులను పూర్తి చేయాలని, శ్రీశైలానికి రైల్వేలైన ఏర్పాటు చేయాలని, జిల్లా అభివృద్ధికి అన్ని రకాల సహకారం అందిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.