విభజన హామీలు అమలు చేయాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 12:19 AM
రాష్ట్ర విభజన సమయంలో చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం నాయకులు రామ్‌నాయక్, మాబాషా డిమాండ్ చేశారు.
సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసనలు
ఆత్మకూరు, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర విభజన సమయంలో చట్టబద్ధంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఎం నాయకులు రామ్‌నాయక్, మాబాషా డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. వెనకబడిన రాయలసీమలో కడప ఉక్కు పరిశ్రమను స్థాపించి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని అన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, కార్మికులకు ఇబ్బంది కలిగే 13గంటల పనిని 8గంటలకు తగ్గించాలని డిమాండ్ చేశారు. నాయకులు వీరన్న, సద్దాం, శివ, గణపతి పాల్గొన్నారు.
సీపీఐ ఆధ్వర్యంలో..
ప్రత్యేక హోదా విభజన హామీలను అమలు చేయాలని సీపీఐ నాయకుడు ప్రతాప్ డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ మంగళవారం ఆత్మకూరులోని గౌడు సెంటర్‌లో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ప్రతాప్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాలుగు సార్లు ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చినప్పటికీ ఎలాంటి ఫలితం లేదన్నారు. సిద్దేశ్వరం అలుగు నిర్మాణం, శ్రీశైలానికి రైల్వే ప్రాజెక్ట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జునీద్‌బాషా, సురేష్, వెంకటశివుడు ఉన్నారు.