Share News

AP Speciality Hospitals Association: నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె పాక్షికం

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:31 AM

ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ శుక్రవారం చేపట్టిన నెట్‌వర్క్‌ ఆస్పత్రుల వైద్య సేవల బంద్‌ పాక్షికంగా జరిగింది. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ తమకు...

AP Speciality Hospitals Association: నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సమ్మె పాక్షికం

అమరావతి, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ శుక్రవారం చేపట్టిన నెట్‌వర్క్‌ ఆస్పత్రుల వైద్య సేవల బంద్‌ పాక్షికంగా జరిగింది. ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ తమకు రూ.2700 కోట్ల బకాయిలు పెట్టిందని, బిల్లులు చెల్లించే వరకూ సేవలు కొనసాగించలేమంటూ శుక్రవారం నుంచి సమ్మెకు పిలుపునిచ్చింది. అయితే సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నుంచి శస్త్ర చికిత్సల కోసం ప్రతిరోజూ అనుమతులు కోరుతూ ట్రస్ట్‌కు దాదాపు 6 వేల నుంచి 6500 వరకు ప్రి-ఆథరైజేషన్లు వస్తాయి. వీటికి ట్రస్ట్‌ అనుమతులిస్తుంది. శుక్రవారం కూడా 6 వేల ప్రి-ఆథరైజేషన్లు ఆసుపత్రుల నుంచి వచ్చాయి.

Updated Date - Oct 11 , 2025 | 05:31 AM