Anand Swaroop Donation: ప్రభుత్వాస్పత్రికి పరమేశు బయోటెక్ రూ. కోటి విరాళం
ABN , Publish Date - Jul 06 , 2025 | 03:54 AM
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి పరమేశు బయోటెక్ లిమిటెడ్ ఎండీ ఆనంద్‌స్వరూప్ రూ.కోటి విరాళం అందించారు.
తూర్పు కలెక్టర్‌కు చెక్ అందజేసిన ఎండీ ఆనంద్ స్వరూప్
గోపాలపురం, జూలై 5(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి పరమేశు బయోటెక్ లిమిటెడ్ ఎండీ ఆనంద్‌స్వరూప్ రూ.కోటి విరాళం అందించారు. ఈ మేరకు శనివారం రాజమహేంద్రవరంలో, జిల్లా కలెక్టర్ ప్రశాంతిని కలిసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద సంబంధిత చెక్‌ను అందజేశారు. ఆస్పత్రిని పునఃనిర్మించాలని సూచించారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు చొరవతో ఈ నిధులు అందించగా, ఎండీ స్వరూ్‌పను ఎమ్మెల్యేతోపాటు, కలెక్టర్ అభినందించారు. సామాజిక అవసరాలకు ప్రభుత్వంతో పాటు దాతల సహకారం అభినందనీయమన్నారు.