పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలి
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:51 PM
మండలంలోని సిమెంటునగర్ గ్రామంలో ఉన్న పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని కార్మి కులు వేడుకున్నారు.
… దీక్షా శిబిరంలో కార్మికులు
… సంఘీభావం ప్రకటించిన టీడీపీ నాయకులు
బేతంచెర్ల, జూన 6 (ఆంధ్రజ్యోతి): మండలంలోని సిమెంటునగర్ గ్రామంలో ఉన్న పాణ్యం సిమెంటు ఫ్యాక్టరీని పునఃప్రారంభించాలని కార్మి కులు వేడుకున్నారు. యాజమాన్యంతో మాజీ మంత్రి బుగ్గన రాజేం ద్రనాథ్ రెడ్డి కుమ్మక్కు అయి ఏడాది నుంచి ఫ్యాక్టరీని మూసివేయడంతో బతుకులు రోడ్డుపై పడ్డాయని వాపోయారు. ఐదు రోజులుగా శాంతియు తంగా కార్మికులు దీక్షలు చేపట్టినా యాజమాన్యం పట్టించుకోకపోవడం బాధాకర మన్నారు. శుక్రవారం బేతంచెర్ల టీడీపీ మండల నాయకులు కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సం దర్భంగా కార్మికుడు మోజెస్ మాట్లాడుతూ మూతపడిన పాణ్యం సిమెం టు ఫ్యాక్టరీ నిర్వహణ మాజీ మంత్రి బుగ్గన, పదవి విరమణ పొందిన డీఎస్పీ నరసింహారెడ్డి కనుసైగల్లో నడుస్తుందన్నారు. ఏడాది నుంచి ఫ్యాక్టరీ మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. కార్మికులను వైసీపీ, టీడీపీ వారిగా విభజించడం శోచనీయ మన్నారు. పలువురిని విధుల్లోకి తీసుకొని టీడీపీ చెందిన వారని 13 మంది విధుల్లోకి తీసుకోలేదన్నారు. యాజమాన్యం కూడా బుగ్గన చెప్పి నట్లే నడుస్తున్నారన్నారు. ఫ్యాక్టరీని పునఃప్రారంభించి కార్మికులను ఆదుకో కపోతే తాము ఆమరణ నిరాహారదీక్షకు వెనుకాడబోమని హెచ్చరించారు. రామసుబ్బయ్య మాట్లాడుతూ సిమెంటు ఫ్యాక్టరీకి ఒక అంగడిగా భావించి మాట్లాడడం దారునమన్నారు. టీడీపీ మండల కన్వీనర్ ఎల్ల నాగయ్య మాట్లాడుతూ సిమెంటునగర్‌లో ప్యాక్టరనీ నమ్ముకుని కార్మికులు ఉన్నార న్నారు. టీడీపీ సీనియర్ నాయకురాలు ఫ్యాక్టరీ యాజమాన్యాలు కార్మికు లను ఆదుకోవాలన్నారు. టీడీపీ నాయకులు కేవీ సుబ్బారెడ్డి, బుగ్గన బ్రహ్మా నందరెడ్డి, జాకీరుల్లా బేగ్, అంబాపురం సర్పంచశ్రీనివాస్ యాదవ్, రాముడు, ఉరుకుందు, వాసు, వెంకటేశ్వర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.