Share News

AP JAC Chairman: పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి

ABN , Publish Date - Jul 07 , 2025 | 02:40 AM

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలని, పదోన్నతులు కల్పించాలని ఏపీ జేఏసీ చైర్మన్‌, ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

AP JAC Chairman: పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలి

  • ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌

విజయవాడ (గాంధీనగర్‌), జూలై 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శులపై పనిభారం తగ్గించాలని, పదోన్నతులు కల్పించాలని ఏపీ జేఏసీ చైర్మన్‌, ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్‌ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం విజయవాడలోని ఎన్జీవో హోమ్‌లో జరిగింది. అనంతరం విద్యాసాగర్‌ విలేకరులతో మాట్లాడుతూ పంచాయతీల్లో కార్యదర్శుల విధుల సమయాలను సవరించాలని, వీడియో కాలింగ్‌ విధానాన్ని తొలగించాలని అన్నారు. గ్రీన్‌ అంబాసిడర్ల వేతనాలు పెంచాలని, వారికి అవసరమైన ట్రై సైకిళ్లు, ఇతర పనిముట్లను సమకూర్చాలని కోరారు. ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర కార్యదర్శి డీవీ రమణ, పంచాయతీ కార్యదర్శుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీటీవీ రమణ పాల్గొన్నారు.

Updated Date - Jul 07 , 2025 | 02:40 AM