Panchayat Buildings: 417 పంచాయతీలకు భవనాలు మంజూరు
ABN , Publish Date - Jul 08 , 2025 | 06:08 AM
రాష్ట్రవ్యాప్తంగా 417 గ్రామ పంచాయతీలకు భవనాలు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన (ఆర్‌జీఎస్ఏ), జాతీయ గ్రామీణ ఉపాధి...
ఒక్కో పంచాయతీకి రూ.32 లక్షలు
అమరావతి, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 417 గ్రామ పంచాయతీలకు భవనాలు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ యోజన (ఆర్‌జీఎస్ఏ), జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2025-26 సంవత్సరానికి సంబంధించిన నిధులతో ఈ భవనాలను నిర్మిస్తారు. ఆర్‌జీఎ్‌సఏ ద్వారా ఒక్కో పంచాయతీకి రూ.25 లక్షలు మంజూరు చేయనుండగా, ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధుల నుంచి మరో రూ.7 లక్షలు కలిపి మొత్తం రూ.32 లక్షలు మంజూరు చేశారు. ఆ మేరకు పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.