Share News

Pollution Control Board: పీసీబీ సభ్యులుగా పంచకర్ల, నాగలపాటి

ABN , Publish Date - Aug 19 , 2025 | 05:47 AM

ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలిలో అధికారేతర సభ్యులుగా నియమితులైన వారిలో ఇద్ద రు సోమవారం బా ధ్యతలు చేపట్టారు.

Pollution Control Board: పీసీబీ సభ్యులుగా పంచకర్ల, నాగలపాటి

అమరావతి, ఆగ స్టు 18(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలిలో అధికారేతర సభ్యులుగా నియమితులైన వారిలో ఇద్దరు సోమవారం బాధ్యతలు చేపట్టారు. భీమిలి నియోజకవర్గం జనసేన బాధ్యుడిగా ఉన్న పంచకర్ల నాగ సందీప్‌తోపాటు చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం, రాజులకండ్రిగకు చెందిన టీడీపీ నేత నాగలపాటి నాగేశ్వరరాజు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని పీసీబీ కార్యాలయంలో చైర్మన్‌ డాక్టర్‌ పీ కృష్ణయ్య, సభ్య కార్యదర్శి శరవణన్‌ సమక్షంలో వీరు బోర్డు సభ్యులుగా చేరారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు హాజరయ్యారు. కాలుష్య నియంత్రణ మండలిలో నాన్‌-అఫీషియల్‌ సభ్యులను నియమించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని పి.కృష్ణయ్య అన్నారు.

Updated Date - Aug 19 , 2025 | 05:48 AM