Palnadu District: అమెరికాలో పల్నాడు బాలుడు మృతి
ABN , Publish Date - Jul 27 , 2025 | 04:26 AM
అమెరికాలోని జఫర్‌సన్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన తుర్లపాటి యత్విక్ సాయి (9)మృతి చెందాడు.
ఈపూరు, జూలై 26 (ఆంధ్రజ్యోతి): అమెరికాలోని జఫర్‌సన్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్నాడు జిల్లా ఈపూరు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన తుర్లపాటి యత్విక్ సాయి (9)మృతి చెందాడు. బాలుడి తండ్రి తుర్లపాటి శ్రీనివాసరావు ఉద్యోగరీత్యా పది సంవత్సరాలుగా అమెరికాలోనే ఉంటున్నారు. యత్విక్‌సాయి అమెరికాలోనే జన్మించాడు. ప్రతిరోజూ వాకింగ్‌కు వెళ్లే తండ్రి వెంట యత్విక్‌సాయి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ఉదయం వాకింగ్‌కు వెళ్లినప్పుడు ట్రక్ ఢీకొట్టడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్టు బంధువులు తెలిపారు.