పండుగ వాతావరణంలో ప్రమాణాలు: పల్లా
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:33 AM
రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి జరగనున్న టీడీపీ సంస్థాగత కమిటీల ప్రమాణస్వీకారాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర...
అమరావతి, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి జరగనున్న టీడీపీ సంస్థాగత కమిటీల ప్రమాణస్వీకారాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పార్టీ శ్రేణులను ఆదేశించారు. సోమవారం పార్టీ ముఖ్య నేతలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. మంగళవారం నుంచి మూడు రోజులపాటు జరిగే మండల, క్లస్టర్, యూనిట్, గ్రామ, బూత్ కమిటీల ప్రమాణస్వీకార కార్యక్రమాలను ప్రతి నియోజకవర్గం, మండలం, గ్రామ స్థాయిలో బాగా నిర్వహించాలన్నారు. కొత్తగా నియమితులైన కమిటీ సభ్యులకు అభినందనలు తెలిపారు.