Padmavati Amavari Brahmotsav Celebrations: చిన్నశేషుడిపై పద్మావతి విహారం
ABN , Publish Date - Nov 18 , 2025 | 04:17 AM
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో మొదలయ్యాయి....
తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
తిరుచానూరు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం ధ్వజారోహణంతో మొదలయ్యాయి. ఉదయం 6 గంటలకు చక్రాత్తాళ్వార్ ముందుకు సాగగా.. వెనకే అమ్మవారికి అభిముఖంగా గజ చిత్రపటాన్ని తిరువీధుల్లో ఊరేగిస్తూ ఆలయానికి తీసుకొచ్చారు. ఉదయం 9.30 గంటలకు గజ చిత్రపటాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణ చేయడంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మధ్యా హ్నం అమ్మవారికి స్నపన తిరుమంజనం, సాయంత్రం ఊంజల్‌సేవ నిర్వహించాక, రాత్రి చిన్నశేష వాహనంపై అమ్మవారు విహరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..పరకామణి, కల్తీనెయ్యి కేసుల దర్యాప్తు వేగంగా సాగుతోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.