SHAR Director: షార్ డైరెక్టర్‌గా పద్మకుమార్
ABN , Publish Date - Aug 01 , 2025 | 04:40 AM
సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్‌గా డాక్టర్ ఈఎస్ పద్మకుమార్ నియమితులయ్యారు.
సూళ్లూరుపేట, జూలై 31 (ఆంధ్రజ్యోతి): సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ డైరెక్టర్‌గా డాక్టర్ ఈఎస్ పద్మకుమార్ నియమితులయ్యారు. తిరువనంతపురంలోని ఐఐఎస్‌యూ డైరెక్టర్‌గా ఉన్న పద్మకుమార్‌ను షార్ డైరెక్టర్‌గా నియమిస్తూ ఇస్రో ప్రధాన కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయి. దీంతో ఆయన శుక్రవారం షార్‌కు వచ్చి బాధ్యతలు తీసుకోనున్నారు. ఇప్పటివరకు ఇక్కడ డైరెక్టర్‌గా ఉన్న ఆర్ముగం రాజరాజన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ (ఈఎస్ఎస్‌సీ)గా బదిలీ అయ్యారు.