ఓవరాల్ చాంపియన్లు నంద్యాల, శ్రీశైలం
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:31 AM
ఉమ్మడి కర్నూలు జిల్లా అంతర పాలిటెక్నిక్ క్రీడాపోటీల్లో ఓవరాల్ చాంపియన్లుగా బాలుర విభాగంలో జీఎంఆర్ శ్రీశైలం కళాశాల, బాలికల విభాగంలో ఈఎ్‌ససీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల కళాశాల జట్లు దక్కించుకున్నాయి.
నంద్యాల హాస్పిటల్, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి కర్నూలు జిల్లా అంతర పాలిటెక్నిక్ క్రీడాపోటీల్లో ఓవరాల్ చాంపియన్లుగా బాలుర విభాగంలో జీఎంఆర్ శ్రీశైలం కళాశాల, బాలికల విభాగంలో ఈఎ్‌ససీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల కళాశాల జట్లు దక్కించుకున్నాయి. 28వ రీజినల్ క్రీడాపోటీలు మంగళవారం ముగిశాయి. పోటీల్లో బాలుర విభాగంలో వాలీబాల్ విజేత ఈఎ్‌ససీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విజేతగా నిలవగా, జీఎంఆర్ శ్రీశైలం జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. కబడ్డీలో జీపీటీ బేతంచెర్ల జట్టు వాసవి పాలిటెక్నిక్ బనగానపల్లె జట్టుపై గెలుపొంది ప్రథమ స్థానం దక్కించుకుంది. ఈ పోటీల్లో బనగానపల్లె జట్టు ద్వితీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో వాలీబాల్ పోటీలో కేవీఎస్సార్ ఇనస్టిట్యూట్ ఆఫ్ కర్నూలు జట్టు ప్రథమ స్థానం, నంద్యాల ఈఎ్‌ససీ ప్రభుత్వ కాలేజీ ద్వితీయ స్థానంలో నిలిచింది. ఖోఖో పోటీలో కేవీఎ్‌సఆర్ ఇనస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్నూలు చాంపియనగా నిలిచింది. అథ్లెటిక్స్ పోటీలో ఇండివిడ్యువల్ చాంపియనగా బిట్స్ కర్నూలు కళాశాలకు చెందిన త్రిమూర్తి దక్కించుకున్నాడు. స్పోర్ట్స్ చాంపియనషి్‌ప జీఎంఆర్ శ్రీశైలం, గేమ్స్ చాంపియనషి్‌ప ఈఎ్‌ససీ నంద్యాల కాలేజీ దక్కించుకున్నాయి. బాలికల ఇండివిడ్యువల్ చాంపియనషి్‌పను కె. రూప, జీపీటీ బేతంచెర్ల కళాశాల విద్యార్థిని దక్కించుకుంది. బాలికల స్పోర్ట్స్ చాంపియనషి్‌ప జీపీటీ బేతంచెర్ల, గేమ్స్ చాంపియనషి్‌ప ఈ ఎ్‌ససీ నంద్యాల కాలేజీ దక్కించుకున్నాయి. ముగింపు కార్యక్రమానికి పూర్వ విద్యార్థి ఎం. రామమద్దయ్య, ప్రిన్సిపాల్ జి.శైలేంద్రకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతలైన జట్లు జనవరి 28నుంచి 30వరకు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్లు పీడీ మార్గరెట్ తెలిపారు.