Share News

Lok Adalat: ఒక్క రోజే 60,953 కేసుల పరిష్కారం

ABN , Publish Date - Sep 14 , 2025 | 03:17 AM

రాష్ట్రవ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లకు విశేష స్పందన లభించింది. వీటి ద్వారా శనివారం ఒక్క రోజే 60,953 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ.109.99 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందజేశారు...

Lok Adalat: ఒక్క రోజే 60,953 కేసుల పరిష్కారం

  • రాష్ట్రవ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లకు విశేష స్పందన

అమరావతి, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా లోక్‌ అదాలత్‌లకు విశేష స్పందన లభించింది. వీటి ద్వారా శనివారం ఒక్క రోజే 60,953 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం రూ.109.99 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందజేశారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, ఏపీ న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్‌ ఎన్‌.రవినాథ్‌ తిల్హరి, హైకోర్టు న్యాయసేవల కమిటీ అధ్యక్షులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు మార్గదర్శకంలో రాష్ట్ర వ్యాప్తంగా 381 లోక్‌ అదాలత్‌ బెంచ్‌లు నిర్వహించారు. రాజీకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. హైకోర్టు న్యాయసేవల కమిటీ ఆధ్వర్యంలో హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్‌ అదాలత్‌లో న్యాయమూర్తి జస్టిస్‌ వై.లక్ష్మణరావు పెండింగ్‌లో ఉన్న 108 కేసులను పరిష్కరించి రూ.2.05 కోట్లను బాధితులకు పరిహారంగా అందజేశారు. లోక్‌ అదాలత్‌లు విజయవంతానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులకు ఏపీ న్యాయసేవాధికార సంస్థ సభ్యకార్యదర్శి బీఎ్‌సవీ హిమబిందు, హైకోర్టు న్యాయసేవల కమిటీ కార్యదర్శి జి.మాలతి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Sep 14 , 2025 | 03:17 AM