Share News

AP Sports Education in Crisis: వ్యాయామ విద్యకు మంగళం

ABN , Publish Date - Apr 12 , 2025 | 05:34 AM

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ కాలేజీల్లో 203 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులను రద్దు చేయడం విద్యార్థుల శారీరక అభివృద్ధిపై ప్రభావం చూపుతోంది. ఈ నిర్ణయంపై వ్యాయామ ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

AP Sports Education in Crisis: వ్యాయామ విద్యకు మంగళం

  • జూనియర్‌ కాలేజీల్లో 203 ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు రద్దు

  • ఇంటర్‌ విద్య డైరెక్టర్‌ నిర్ణయంపై సర్వత్రా ఆందోళన

నంద్యాల హాస్పిటల్‌, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల మనోవికాసానికి క్రీడలు దోహదపడతాయి. చదువుతో పాటు విద్యార్థి దశలో క్రీడలూ కీలకమే. ఇంత ప్రాముఖ్యత ఉన్న క్రీడలపై ఇంటర్‌ విద్యాశాఖ ధోరణి విమర్శలపాలవుతోంది. జూనియర్‌ కాలేజీల్లో ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులను రద్దు చేస్తూ ఆ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం విద్యార్థుల శారీరక ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేసింది. వ్యాయా మ ఉపాధ్యాయుల భవిష్యత్తును అగమ్యగోచరం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీడీ పోస్టులను రద్దు చేస్తూ విద్యా శాఖ డైరెక్టర్‌ కృతిక శుక్లా ఆదేశాలిచ్చారు. ఈ మేరకు 203 మంది పీడీలను ఇతర సబ్జెక్టులకు బదలాయిస్తూ 3న ఉత్తర్వులు జారీ అయ్యా యి. నిజానికి గత 22 ఏళ్ల నుంచి వ్యాయామ ఉపాధ్యాయులకు అర్హత ఉన్నా పదోన్నతులు చేపట్టలేదు. అంతేకాకుండా పీడీ పోస్టుల నియామకం కూడా చేపట్టకపోవడంతో రెండు దశాబ్దాల నుంచి రాష్ట్రవ్యాప్తంగా పీడీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. కొన్నేళ్లుగా రాష్ట్రంలో 84 కొత్త జూనియర్‌ కళాశాలలకు రెగ్యుల ర్‌ అధ్యాపకులు లేకపోవడంతో కేవలం కాంట్రాక్టు అధ్యాపకులతో నెట్టుకొస్తున్నా రు. ప్రస్తుతం బదలాయించిన, సర్దుబాటు చేసిన పోస్టులను ఈ కళాశాలలకు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 455 పోస్టులకు గాను 214 పోస్టులు సర్దుబాటు చేయగా, 241 పోస్టులను బదలాయిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో పీడీ పోస్టుల రద్దుపై రాష్ట్రవ్యాప్తంగా వ్యాయామ ఉపాధ్యాయులు ఆందోళనకు సిద్ధమైనట్లు సమాచారం.


పదోన్నతులపై స్వయంకృతం

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పీడీ పోస్టులు ఇన్నేళ్లు ఎందుకు ఖాళీగా ఉన్నాయన్న విషయం చర్చనీయాంశంగా మారింది. వ్యాయామ ఉపాధ్యాయుల్లో సమన్వయలోపమే కారణమని తెలుస్తోంది. గతంలో పదోన్నతుల విషయంలో జడ్‌పీ, ప్రభుత్వ పాఠశాల ల పీఈటీలు సీనియారిటీ విషయం లో కోర్టుకు ఎక్కా రు. ఈ విషయం లో ప్రభుత్వం చొర వ చూపకపోవడం తో పదోన్నతులు నిలిచిపోయాయి. 1998 డీఎస్సీ నుంచి పీఈటీ నియామకాల్లో జడ్‌పీ, ప్రభుత్వ పాఠశాలలు అనే తేడా లేకుండా మెరిట్‌ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేశారు. 2003 తర్వాత ఇంతవరకు వ్యాయామ ఉపాధ్యాయులకు కళాశాలల్లో పీడీలుగా పదోన్నతులు ఇవ్వలేదు. జూనియర్‌ లెక్చరర్స్‌ను కాంట్రాక్టు కింద తీసుకున్నారే కానీ, ఒక్క పీడీని కూడా కాంట్రాక్టు కింద తీసుకున్న పాపాన పోలేదు.

ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలి

రాష్ట్రవ్యాప్తంగా ఫిజికల్‌ డైరెక్టర్‌ పోస్టులు రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సీఎం చంద్రబాబు జోక్యం చేసుకో వాలి. విద్యాశాఖ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి. ఎంపీఈడీ అర్హత ఉన్న వ్యాయామ ఉపాధ్యా యులు ఎంతోమంది ఉన్నారు. వీరంతా పీడీ పోస్టుల భర్తీ కోసం నిరీక్షిస్తున్నారు. కాబట్టి జూనియర్‌ కళాశాలల్లో ఆటలు కనుమరుగయ్యే పరిస్థితిని నివారించి సమస్యను పరిష్కరించాలి.

- విశ్వనాథ్‌, పీడీ,

దీబగుంట్ల హైస్కూల్‌, నంద్యాల జిల్లా

Updated Date - Apr 12 , 2025 | 05:53 AM