Deputy CM Pawan: మన సంస్కృతి, నాగరికత దేశానికి పునాది
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:36 AM
మన సంస్కృతి, నాగరికత ఎప్పుడూ భారతదేశానికి పునాదిగా ఉన్నాయని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): మన సంస్కృతి, నాగరికత ఎప్పుడూ భారతదేశానికి పునాదిగా ఉన్నాయని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అయోధ్యలో ధ్వజారోహణ కార్యక్రమంపై ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. శ్రీరామ జన్మభూమి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం కేవలం నిర్మాణ ప్రాజెక్టు మాత్రమే కాదని, ఇది సాంస్కృతిక పునరుజ్జీవనానికి ప్రతీకగా పేర్కొన్నారు. సనాతన ధర్మం లోతైన జ్ఞానం, సమానత్వం, సోదరభావం, శాంతి, సామరస్యంతో పాటు ప్రకృతిని తల్లితో పొల్చి చూపడం వంటి లోతైన విషయాల్ని నేర్పిందని వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో వలస రాజ్య చిహ్నాలు, సంకేతాలను కడిగివేయడమే కాకుండా, మన స్వంత గుర్తింపును తిరిగి పొందేందుకు జాతీయ స్వీయ విలువభావాలను పునరుద్ధరించడానికి చొరవ తీసుకోవడంపై సంతోషంగా, గర్వంగా ఉందన్నారు. నావికాదళంలోని సెయింట్ జార్జ్ శిలువ స్థానంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ రాజముద్ర వేయడం మన వీరులను గౌరవించడం అవుతుందన్నారు. మన భారతీయతను తిరిగి తీసుకురావడానికి ఇది ఒక శక్తిమంతమైన మేల్కొలుపుగా పవన్ ఆభివర్ణించారు.