Share News

Somireddy Chandramohan Reddy: జగన్‌ హోంలోనే హోం శాఖ

ABN , Publish Date - Mar 12 , 2025 | 06:39 AM

‘గత ప్రభుత్వంలో హోంశాఖ జగన్‌ హోం లోనే ఉంది. పోలీసు చట్టాలు వైసీపీ నేతల బూట్ల కింద నలిగిపోయాయి’ అని సీనియర్‌ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు.

Somireddy Chandramohan Reddy: జగన్‌ హోంలోనే హోం శాఖ

  • వైసీపీ నేతల బూట్ల కింద నలిగిన పోలీసు చట్టాలు

  • అసెంబ్లీలో ‘హోం’ డిమాండ్లపై చర్చలో ఎమ్మెల్యేలు

అమరావతి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ‘గత ప్రభుత్వంలో హోంశాఖ జగన్‌ హోం లోనే ఉంది. పోలీసు చట్టాలు వైసీపీ నేతల బూట్ల కింద నలిగిపోయాయి’ అని సీనియర్‌ శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో హోంశాఖకు సంబంధించి డిమాండ్లపై చర్చలో ఆయన మాట్లాడారు. ‘ఆనాడు క్వార్ట్జ్‌ మైనింగ్‌ అక్రమాలపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాం. నాపై 18 కేసులు పెట్టి వేధించారు. చివరకు నాపై హిజ్రాలతో దాడి చేయించారు’ అని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ... ‘జగన్‌ ప్రభుత్వంలో మా నాయకుడు చంద్రబాబు ఇంటిపైన, కార్యాలయంపైనా దాడులు చేశారు. నిరసన చేపట్టిన టీడీపీ కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధించారు. మాచర్లలో చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త జై చంద్రబాబు అన్నందుకు గొంతు కోశారు. నాపై 8 కేసులు పెట్టారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేత విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ... ‘ఇన్నేళ్లయినా వివేకా హత్యకేసులో పురోగతి లేదు. సాక్షులు ఒక్కొక్కరుగా ఇప్పటికే ఆరుగురు చనిపోయారు. ఆ హత్య చేసిందెవరో రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు’ అని అన్నారు. తొలుత జీరో అవర్‌లో ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను సభ దృష్టికి తెచ్చారు.

Updated Date - Mar 12 , 2025 | 06:39 AM