పని చేస్తేనే ఫైసలు
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:53 PM
ఉపాధి హామీ పథకం అవినీతికి కేరాఫ్‌గా ఉండేది.
‘ఉపాధి’లో అవినీతికి చెక్
శ్రామికులకూ ఈకేవైసీ విధానం అమలు
రెండు సార్లు ముఖ హాజరు
బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట
ఉపాధి హామీ పథకం అవినీతికి కేరాఫ్‌గా ఉండేది. సోషల్ ఆడిట్‌లో ఇదే విషయం పలుమార్లు స్పష్టమైంది. ఈనేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి పథకంలో మస్టర్ల మాయాజాలానికి అడ్డుకట్ట వేయడంతో పాటు అవినీతి అక్రమారులను గుర్తించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంది. ప్రతి శ్రామికుడికి ఈకేవైసీ చేసి పనులకు హాజరయ్యే వారికి వేతనం అందేలా ప్రత్యేక విధానాన్ని అమలుచేస్తోంది.
నంద్యాల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీలో పనిచేసే శ్రామికులకు ఇక నుంచి పనిచేస్తే ఫైసలు అందుతాయి. బోగస్ శ్రామికులు లేకుండా పనిచేసే సమయంలో ఆయా శ్రామికులకు రెండుసార్లు ముఖ హాజరు కూడా తీసే విధంగా ప్రణాళిక రచించింది. తద్వారా ఎప్పటికప్పుడు ఆయా పనులకు హాజరయ్యే వారికి మాత్రమే వేతనం అందనుంది. ఇదేతరుణంలో బోగస్ శ్రామికులకు ఇక చెక్ పెట్టినట్లైంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. గతంలో మాదిరిగా కాకుండా ఉపాధిలో పని చేస్తేనేవేతనం అన్నట్లైంది. ఏది ఏమైనా ఉపాధి హామీ పథకంలో అవినీతి అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో అవినీతి అక్రమార్కులకు ఝులక్ ఇచ్చినట్లైంది.
--------------------------------------------------------------------------------------------
జిల్లాలో పరిస్థితి ఇలా...
--------------------------------------------------------------------------------------------
ఫ జిల్లాలో జాబ్ కార్డులు : 2,67,000
ఫ ఉపాధిలో పని చేస్తున్న శ్రామికులు : 5,01,000మంది
ఫ యాక్టివ్ జాబ్ కార్డులు : 2,15,000
ఫ పనికి వస్తున్న శ్రామికుల సంఖ్య : 3,82,000 మంది
ఫ ఈకేవైసీ చేయాల్సినవి : 3,82,000
ఫ ఈకేవైసీ పూర్తయినవి : 1,100 మంది
--------------------------------------------------------------------------------------------
ప్రభుత్వ ఆదేశాల మేరకు..
ఇప్పటికే ప్రభుత్వం నుంచి జిల్లా డ్వామా అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆశాఖ అధికార మంత్రాంగం సైతం అప్రమత్తమై ఆయా పనుల్లో నిమగ్నమ య్యారు. జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్‌లో ఉన్న 2,15,000 జాబ్‌కార్డుల పరంగా.. 3,82,000 మందికి ఈకేవైసీ చేయాల్సి ఉంది. ఇప్పటికి జిల్లాలో 1,100మందికి పూర్తి చేశారు. మిగిలిన వారందరికీ కూడా అక్టోబరు నెలలో పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకున్నట్లు సమాచారం.
ప్రతి నాలుగు గంటలకు ఒకసారి
ఉపాధిలో పనుల ఎంపిక నుంచి ఆయా పనులు పూర్థైయ్యే వరకు ఆశాఖ అధి కారులు పకడ్బందీగా చర్యలు తీసుకోనున్నారు. పనికి వచ్చే వారికి జాబ్‌కార్డు ఆధా రంగా ఆయా శ్రామికులకు సంబంధించి ఈకేవైసీ చేయడం, పని చేసే సమయాల్లో ప్రతి నాలుగు గంటల వ్యత్యాసంతో రెండు ముఖ హాజరు( ఫేస్ బయోమెట్రిక్) వేయించడం జరుగుతుంది. ఆయా సమయాల్లో ఎవరైనా ఒకరికి బదులు మరొకరు వేసే ప్రయత్నం చేసి పనిచేసినట్లు చూపితే వారికి ఎలాంటి వేతనం రాదు. శ్రామికుల జాబ్ కార్డు ఆధారంగా ఆయా వారి ఆధార్ అనుసంధానం కూడా చేస్తారు. మొత్తంగా భవిష్యతలో ఉపాధిలో బోగస్ మస్టర్లకు అడ్డుకట్ట పడినట్లైంది.
ఈకేవైసీ వేగవంతం చేస్తాం
రఉపాధి శ్రామికులకు ఈకేవైసీ విధానం అక్టోబరు నెలలో పూర్తిచేసేలా చర్యలు తీసుకున్నాం. పని చేసే సమయాల్లో రెండు సార్లు ముఖ హాజరు చేయాల్సి ఉంది. తద్వారా భవిష్యత్తులో అక్రమంగా వేతనం పొందే అవకాశం లేదు. శ్రామికులు కూడా ఈ విషయాన్ని గ్రహించాలి.
ఫ సూర్యనారాయణ. పీడీ, డ్వామా, నంద్యాల