Online Permits for Vinayaka Mandapams: వినాయక మండపాలకు ఆన్‌లైన్‌లో అనుమతులు
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:22 AM
రానున్న వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని, వినాయక ఉత్సవ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా, ఆన్‌లైన్‌లో..
బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే వారికి మాత్రమే: డీజీపీ
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రానున్న వినాయక చవితి పండుగను దృష్టిలో పెట్టుకుని, వినాయక ఉత్సవ మండపాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానం ద్వారా, ఆన్‌లైన్‌లో అనుమతులు పొందడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ అవకాశం కల్పించింది. గణే్‌షఉత్సవ్.నెట్ వెబ్‌సైట్‌ను రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చామని డీజీపీ హరీ్‌షకుమార్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. మండప నిర్వాహకులు అనుమతుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ ముఖ్యాధికారి మండపాలు ఏర్పాటు చేసే ప్రాంతాలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన ఎన్‌ఓసీ జారీచేస్తారని డీజీపీ తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటు చేసే వినాయక ఉత్సవ మండపాలకు మాత్రమే ఈ అనుమతులు అవసరమని స్పష్టం చేశారు. ఈ సేవలు పూర్తిగా ఉచితమని, ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.