ఉల్లి పంట.. గొర్రెల పాలు
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:32 AM
ఉల్లికి ధర లేకపోవడం తో రైతులు పొలా ల్లోనే వదిలేస్తున్నా రు.
జూపాడుబంగ్లా, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉల్లికి ధర లేకపోవడం తో రైతులు పొలా ల్లోనే వదిలేస్తున్నా రు. రూ. లక్షల పెట్టుబడులు పెట్టి నష్టాల పాలవుతున్నారు. బుధవారం తంగడంచ గ్రామానికి చెంది న నాగశేషులు 5 ఎకరాలు, ధనుంజయుడు 3 ఎకరాలు ఉల్లిపంటను గొర్రెలు మేసేందుకు వదిలేశారు. ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70వేల వరకు పెట్టుబడి పెట్టి చివరకు పంటకోత సమయంలో ధరలేకపోవడంతో వదిలేశామని ఉల్లిరైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఉల్లిపంట వేసి ధరలేకపోతే రైతుకు హెక్టారుకు రూ.50వేల ప్రకారం పంటనమోదు చేసుకున్న రైతులకు అందజేస్తామని చెప్పారు. అయితే నంద్యాల జిల్లాలో ఉల్లిపంట వేయలేదని ఉద్యానశాఖ అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వం అందించే పరిహారం అందకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. ఉల్లిరైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.