కర్నూలులో ఒకరికి కొవిడ్ పాజిటివ్
ABN , Publish Date - Jun 02 , 2025 | 11:44 PM
ర్నూలు జిల్లాలో ఒకరికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.
రోగిని జీజీహెచ కొవిడ్ వార్డుకు తరలింపు
కర్నూలు హాస్పిటల్, జూన 2 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో ఒకరికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆరు రోజుల క్రితం ఎమ్మిగనూరు మండలం కల్లుగోట్లు గ్రామానికి చెందిన ఓ 65ఏళ్ల వృద్ధుడు తీవ్ర ఆయాసం, జ్వరంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రికి వచ్చారు. రోగికి మెడిసిన విభగానికి చెందిన వైద్యులు అడ్మిషన చేయించుకున్నారు. రోగికి బీపీ, మధుమేహంతో పాటు ఆయాసం ఎక్కువ ఉం డటంతో ఆర్‌టీపీసీఆర్ కొవిడ్ టెస్టు నిర్వహించారు. సోమవారం ఈ పరీక్షలో రోగికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యాధికారులు అధికారులు అప్రమత్తమ య్యారు. హాస్పిటల్ ఇనచార్జి సూపరింటెండెంట్ డా.డి.శ్రీరాములు కొవిడ్ వార్డును సందర్శించారు. రోగి మెడికల్ వార్డు నుంచి కొవిడ్ వార్డుకు షిఫ్ట్ చేశారు.
అధికారుల నిర్లక్ష్యం..
కొవిడ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా కేసులు బయట పడుతుండటంతో డైరెక్టర్ ఆప్ మెడికల్ ఎడ్యుకేషన (డీఎంఈ) ఆదేశాలతో కొద్దిరోజుల క్రితం కొవిడ్ వార్డును అధికారులు ఏర్పాటు చేశారు. పది మంచాల సామర్థ్యంతో వెంటిలేటర్లను ఉంచారు. కొవిడ్ వార్డుకు ఓనర్సింగ్ స్టాఫ్‌ను మూడు షిప్టులలో వేసి అదికారులు చేతులు దు లుపుకున్నారు. కొవిడ్ మందులు ఏర్పాటుచేసిన వైద్యులు, డ్యూటీ డాక్టర్లు, ఎంఎనవో, ఎఫ్‌ఎనవో, శానిటేషన సిబ్బందిని ఇంత వరకు నియమించకుండా అధికారులు నిర్లక్ష్యం వహించారు. జ్వరం, దగ్గు, జలుబు, గొంతునొప్పి లక్షణాలో ఎవరు వచ్చినా జనరల్ మెడిసిన వైద్యులే చికిత్స అందిస్తున్నారు.
సిబ్బందిని నియమిస్తాం:
ఆసుపత్రిలో కొవిడ్ పాజిటివ్ కేసు ఒకటి నమోదు అయ్యింది. పాత గైనిక్ వార్డులో ఏర్పాటుచేసిన కొవిడ్ వార్డులో పూర్తిస్థాయిలో సిబ్బంది, వైద్యులను నియమిస్తాం. రోగికి మధుమేహం, బీపీ, ఆయాసం, జ్వర లక్షణాలు ఉన్నాయి.
డా.డి.శ్రీరాములు, ఇనచార్జి సూపరింటెండెంట్, జీజీహెచ, కర్నూలు