CM Chandrababu:16 నెలల్లోనే..రూ.లక్ష కోట్ల సంక్షేమం, అభివృద్ధి
ABN , Publish Date - Oct 18 , 2025 | 05:23 AM
పేదరిక నిర్మూలన అంటే కేవలం ఆర్థిక సా యం చేయడం కాదు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడడం.. ఎదగడానికి అవకాశాలు కల్పించడం.. అందరితో సమానంగా ముందుకు నడిపించడం’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
ఎక్కడా లేని విధంగా ప్రతి నెలా రూ.2,758 కోట్ల పింఛన్లు: సీఎం
పేదల జీవితాల్లో వెలుగులు నింపే పీ-4లో భాగస్వాములవండి
చంద్రబాబు పిలుపు
అమరావతి, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ‘పేదరిక నిర్మూలన అంటే కేవలం ఆర్థిక సా యం చేయడం కాదు. పేదల ఆత్మగౌరవాన్ని కాపాడడం.. ఎదగడానికి అవకాశాలు కల్పించడం.. అందరితో సమానంగా ముందుకు నడిపించడం’ అని సీఎం చంద్రబాబు అన్నారు. 16 నెలల్లో రూ.లక్ష కోట్లకు మించిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామ ని తెలిపారు. శుక్రవారం(అక్టోబరు 17) అం తర్జాతీయ పేదరిక నిర్మూలన దినాన్ని పురస్కరించుకుని ఆయన తమ ప్రభుత్వ లక్ష్యాలను ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. ‘స్వర్ణాం ధ్ర విజన్ 2047లోని ప్రధాన లక్ష్యం పేదరిక నిర్మూలన. దానిని చేరుకునేందుకు కూటమి ప్రభుత్వం మొదటి రోజు నుంచీ పనిచేస్తోం ది. దేశంలో ఎక్కడా లేని విధంగా నెలనెలా రూ.2,758 కోట్లతో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 207 అన్న క్యాంటీన్లు పునఃప్రారంభించి రూ.5కే పేదల ఆకలి తీరుస్తున్నాం. దీపం 2.0 పథకంతో పేదింటి మహిళలకు ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. పేదింటి పిల్లలు చదువుకుని వృద్ధిలోకి రావాలన్న లక్ష్యంతో ఇంట్లో ఎంత మంది చదువుతుంటే అంతమందికి తల్లికి వందనం కింద ఏడాదికి రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం. స్త్రీ శక్తి పథకం ద్వారా ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడతగా రూ.7వేలు జమ చేశాం. ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద రూ.246 కోట్లు, ‘ఆటో డ్రైవర్ సేవలో’ కింద రూ.435 కోట్లు ఇచ్చాం. సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోవైపు పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఎంచుకున్న మార్గమే పీ-4 జీరో పావర్టీ కార్యక్రమం. ఇందులో భాగస్వాములవ్వాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా’ అని పేర్కొన్నారు.
వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో ‘గూగుల్’ కథనంపై సీఎం ఆనందం
విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంట ర్ ఏర్పాటుపై అంతర్జాతీయ మీడియా కూ డా విస్తృత స్థాయిలో కవరేజీ ఇచ్చింది. ప్రముఖ అంతర్జాతీయ పత్రిక వాల్‌స్ట్రీట్ జర్నల్ ప్రముఖంగా కథనాన్ని ప్రచురించింది. దీనిపై సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. వాల్‌స్ట్రీట్ జర్నల్‌లో విశాఖపట్నం పేరు, గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు గూగుల్ 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం తనకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. టెక్నాలజీలో పెట్టుబడుల ఆకర్షణలో విశాఖ ప్రపంచపటంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమిస్తోందని, ఇది శుభ పరిణామమని చంద్రబాబు పేర్కొన్నారు. తన ట్వీట్‌కు వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనాన్ని ట్యాగ్ చేశారు.
జీఎస్టీ కార్యక్రమాలపై సమగ్ర పుస్తకం
ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేశారు
మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు అభినందనలు
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనను విజయవంతం చేశారంటూ మంత్రులు, వివిధ శాఖల అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు. జీఎస్టీపై నెలరోజులపా టు రాష్ట్రవ్యాప్తంగా చేసిన కార్యక్రమాలపై సమగ్రంగా ఒక పుస్తకాన్ని ప్రచురించాలని ఆదేశించారు. శుక్రవారం అందుబాటులో ఉన్న మంత్రులు, అధికారులతో సచివాలయంలో ఆయన భేటీ అయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రధాని నాలుగోసారి రాష్ట్రంలో పర్యటించారని.. ఈసారి పర్యటనను ఆయన ఎంతో ఆస్వాదించారన్నారు.