Minister Satya kumar: ఒక్కసారి రక్తదానంతో ముగ్గురికి ప్రాణదానం
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:43 AM
అపోహలు వీడి రక్తదానం చేసేందుకు యువత ముందుకురావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ పిలుపునిచ్చారు.
విశాఖ వర్క్‌షాపులో మంత్రి సత్యకుమార్
విశాఖపట్నం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): అపోహలు వీడి రక్తదానం చేసేందుకు యువత ముందుకురావాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్ పిలుపునిచ్చారు. ఒకసారి రక్తదానం చేయడం ద్వారా ముగ్గురి ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉందన్నారు. రక్త మార్పిడి సేవల విభాగం, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో రక్తం, రక్త ఉత్పత్తుల హేతుబద్ధ వినియోగం అనే అంశంపై ఏర్పాటు చేసిన రెండు రోజుల జాతీయ వర్క్‌షా్‌పను మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తం అవసరమైనంత మేర అందుబాటులో లేకపోవడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. అందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. వర్క్‌షా్‌పలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సునీతశర్మ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మేగా ప్రవీణ్ ఖో బ్రగడే తదితరులు మాట్లాడారు.