Women and Child Welfare: మహిళా సంక్షేమశాఖలో పలు నోటిఫికేషన్లు రద్దు
ABN , Publish Date - Aug 16 , 2025 | 03:39 AM
రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పిల్లల సంక్షేమ కమిటీలు,సీడబ్ల్యూసీ, జువెనైల్ జస్టిస్ బోర్డ్స్ జేజేబీ, బాలల హక్కుల ..
వారంలో మళ్లీ కొత్త నోటిఫికేషన్ల విడుదల
అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పిల్లల సంక్షేమ కమిటీలు,(సీడబ్ల్యూసీ), జువెనైల్ జస్టిస్ బోర్డ్స్( జేజేబీ), బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎ్‌ససీపీసీఆర్)చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించి ఇటీవల మహిళా శిశు సంక్షేమశాఖ వేర్వేరుగా జారీ చేసిన నోటిఫికేషన్లను రద్దు చేయాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు వీటిని రద్దు చేశారు. వారం రోజుల్లో వీటికి సంబంధించి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు తెలిపారు.