AP State Electricity Employees: 2004లోపు చేరినవారికి ఓపీఎస్ అమలు చేయాలి
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:31 AM
1999 ఫిబ్రవరి ఒకటి నుంచి 2004 ఆగస్టు 31 మధ్య విధుల్లో చేరిన విద్యుత్తు సంస్థల ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను అమలు చేయాలని...
లేదా 15 నుంచి ఆందోళన.. విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): 1999 ఫిబ్రవరి ఒకటి నుంచి 2004 ఆగస్టు 31 మధ్య విధుల్లో చేరిన విద్యుత్తు సంస్థల ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ను అమలు చేయాలని రాష్ట్ర విద్యుత్తు ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. లేదంటే వచ్చేనెల వచ్చేనెల 15 నుంచి 22 దాకా దశలవారీ ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించింది. ఈమేరకు జేఏసీ చైర్మన్ బి.కృష్ణయ్య, కన్వీనర్ రాఘవరెడ్డి తదితరులు ఏపీ జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు, ట్రాన్స్‌కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తి చేకూరిని కలసి వినతి పత్రాలు అందించారు.