OP Books: జగన్ బొమ్మతోనే ఓపీ పుస్తకాలు
ABN , Publish Date - Dec 22 , 2025 | 06:21 AM
రాష్ట్రంలో ప్రభుత్వం మారినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మా త్రం పాతవాసన పోలేదు.
తీరు మారని వైద్యశాఖ
పెనమలూరు, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వం మారినా వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మా త్రం పాతవాసన పోలేదు. కృష్ణాజిల్లా పెనమలూరు పీహెచ్‌సీలో రోగులకు ఓపి పుస్తకాలను పాతవే కొనసాగించడంతోపాటు అప్పటి ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్ ఫొటోలున్న పుస్తకాలనే ఇస్తున్నారు. వైసీపీ నాయకుల ఫొటోలు ఎక్కడా లేకుండా చూడాలని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా పదేపదే చెబుతున్నా వైద్యాధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.