Minister Narayana: నాలుగైదు రోజుల్లో పాత చెత్త శుభ్రం
ABN , Publish Date - Sep 18 , 2025 | 04:44 AM
రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ల్లో లెగసీ వ్యర్థాల(పేరుకుపోయిన చెత్త కుప్పలు)ను నాలుగైదు రోజుల్లో శుభ్రం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి.నారాయణ తెలిపారు.
మునిసిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్నాం: మంత్రి నారాయణ
ఏలూరు, రాజమహేంద్రవరం, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా మునిసిపాలిటీ, కార్పొరేషన్‌ల్లో లెగసీ వ్యర్థాల(పేరుకుపోయిన చెత్త కుప్పలు)ను నాలుగైదు రోజుల్లో శుభ్రం చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి.నారాయణ తెలిపారు. బుధవారం ఏలూరు నగరంలోని డంపింగ్ యార్డును, టిడ్కో ఇళ్లను స్థానిక ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్‌తో కలసి పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌లో గోదావరి పుష్కరాల నేపఽథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో కలసి అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ రెండు సందర్భాల్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘పేరుకుపోయిన 85 లక్షల టన్నుల వ్యర్థాలను శుభ్రం చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. ఇప్పటి వరకు 83 లక్షల టన్నులను మిషన్ల ద్వారా శు ద్ధి చేశాం. వర్షాల వల్ల ఆలస్యమైంది. అక్టోబరు 2 నాటికి అంతా క్లీన్‌గా ఉంటుంది. రోజుకు సగటున 35 మెట్రిక్ టన్నుల చెత్తను రాష్ట్రవ్యాప్తంగా శుభ్రం చేయిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను ఈ ఏడాది డిసెంబరు నాటికి, 360 చదరపు అడుగుల టిడ్కో ఇళ ్లను మార్చి నెలాఖరుకు పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టాం’ అని తెలిపారు. ‘మునిసిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. 17 నగర పంచాయతీల్లో ఎన్నికలపై స్టే ఎత్తివేతలను ఆయా ఎమ్మెల్యేలు పర్యవేక్షించి చర్యలు తీసుకోవాలని కోరాం. రాష్ట్రంలో మున్పిపల్ కార్పొరేష న్లు, మునిసిపాల్టీలన్నింటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తాం. పురపాలకశాఖ పనితీరుపై సీఎం అసహనం వ్యక్తం చేయలేదు.’ అని తెలిపారు.