అధికారులు సమన్వయంతో పని చేయాలి
ABN , Publish Date - Oct 15 , 2025 | 11:38 PM
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని రెవెన్యూ, రిజిసే్ట్రషన శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.
రెవెన్యూ, రిజిసే్ట్రషన శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్
ఓర్వకల్లు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలని రెవెన్యూ, రిజిసే్ట్రషన శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. మండలంలోని నన్నూరు రాగమయూరిలో జరుగుతున్న పనులను బుధవారం మంత్రి అనగాని సత్యప్రసాద్‌తో పాటు ప్రోగ్రాం స్పెషల్ ఆఫీసర్ వీర పాండియన, కలెక్టర్ సిరి పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ బస్సులు అనువుగా తిరగడానికి రోడ్లు మరింత వైడ్లింగ్, లెవలింగ్ చేయించాలన్నారు. పార్కింగ్ ప్రదేశాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలన్నారు. పార్కింగ్ ప్రదేశంలో ఎక్కువగా లైటింగ్, మైక్ సిసం ప్రాపర్‌గా ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అయితే.. సభ ముగిశాక ప్రజలు సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు ట్రాఫిక్ జామ్ కాకుండా పోలీసు అధికారులు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గోపాలపురం ఎమ్మెల్యే వెంకటరాజు, అనంతపురం జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు.