Share News

విషజ్వరాలపై స్పందించిన అధికారులు

ABN , Publish Date - Jul 18 , 2025 | 11:20 PM

విషజ్వరాలపై అధి కారులు స్పందించారు.

విషజ్వరాలపై స్పందించిన అధికారులు

సిద్దవటం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): విషజ్వరాలపై అధి కారులు స్పందించారు. శుక్ర వారం జ్యోతి, వంతాటిపల్లె, బందారుపల్లె కాలనీల్లో సర్వే నిర్వహించారు. ఈ సందర్భగా ప.కొత్తపల్లె వైద్యాధికారి ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ విషజ్వరాలు సోకిన వారిని గుర్తించడానికి సర్వే నిర్వహిం చా మన్నారు. అపరిశుభ్రత ప్రాంతాల్లో లార్వా పిచికారీ చేశామని, కళ్లు మంట లు, జలుపు, దగ్గు, తలనొప్పి విరేచనాలతో బాధపడే వారు స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లి చికిత్సలు చేయించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ సూపర్‌వైజర్‌ మౌలాలి, హెల్త్‌ అసిస్టెంట్‌ వెంకటసుబ్బయ్య, ఆరోగ్య కార్యకర్తలు, ఆశాలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 18 , 2025 | 11:20 PM