ACB Operation: డెయిరీ ఫాం కోసం లంచం
ABN , Publish Date - Mar 12 , 2025 | 05:19 AM
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా డెయిరీ ఫాంల ఏర్పాటుకు దరఖాస్తులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ అద్దంకి....

ఏసీబీకి చిక్కిన పరిశ్రమల ప్రోత్సాహక అధికారి
అద్దంకి, మార్చి 11(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ద్వారా డెయిరీ ఫాంల ఏర్పాటుకు దరఖాస్తులను ప్రాసెస్ చేసేందుకు లంచం తీసుకుంటూ అద్దంకి, చీరాల నియోజకవర్గాల పరిశ్రమల ప్రోత్సాహక అధికారి తన్నీరు ఉమాశంకర్ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ ఏఎస్పీ మహేంద్ర మాతే కథనం మేరకు.. సంతమాగులూరుకు చెందిన వీర్ల రమే్‌షబాబు, అద్దంకి అశ్వని పీఎంఈజీపీ ద్వారా రూ.20 లక్షల చొప్పున బ్యాంక్ రుణాలు పొందేందుకు పరిశ్రమల శా ఖ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిని ప్రాసెస్ చేసేందుకు ఉమాశంకర్ రూ.20 వేల చొప్పున లంచం డిమాండ్ చేశారు. దీంతో రమే్‌షబాబు, అశ్వని సోదరుడు స్టీఫెన్ గుంటూరు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. మంగళవారం అద్దంకిలో కే అండ్ కే కన్సల్టెన్సీ ఆఫీ్‌సలో ఉన్న ఉమాశంకర్ డబ్బు తీసుకురమ్మని దరఖాస్తుదారులకు చెప్పారు. వారు తీసుకెళ్లగా అక్కడ పనిచేసే కిషోర్‌బాబును తీసుకోమని ఉమాశంకర్ చెప్పారు. డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి, ఉమాశంకర్, కిషోర్‌బాబును అదుపులోకి తీసుకున్నారు.