Odisha CM Mohan Charan: పాడేరులో బిర్సాముండా కాంస్య విగ్రహం
ABN , Publish Date - Nov 17 , 2025 | 04:50 AM
ల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఏర్పాటు చేసిన ఆదివాసీ యోధుడు భగవాన్ బిర్సాముండా కాంస్య విగ్రహాన్ని...
ఆవిష్కరించిన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ
పాడేరు, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులో ఏర్పాటు చేసిన ఆదివాసీ యోధుడు భగవాన్ బిర్సాముండా కాంస్య విగ్రహాన్ని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బిర్సాముండా జయంత్యుత్సవాల్లో భాగంగా బీజేపీ, వనవాసీ కల్యాణాశ్రమ్, ఆదివాసీ నేతల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, వైద్య, ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, గిరిజన సహకార సంస్థ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్ దొన్నుదొర, ఎస్‌టీ కమిషన్ చైర్మన్ బుజ్జిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పాంగి రాజారావు, జిల్లా అధ్యక్షురాలు శాంతకుమారి తదితరులు పాల్గొన్నారు.