వైసీపీ హయాంలోనే ఒబెరాయ్‌కు భూములు: బుచ్చిరాంప్రసాద్
ABN , Publish Date - Aug 26 , 2025 | 06:13 AM
హిందూ మతం, హిందూ దేవుళ్లపై జగన్‌కి, వైసీపీ నేతలకు ఏ మాత్రం గౌరవం లేదని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ విమర్శించారు.
అమరావతి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): హిందూ మతం, హిందూ దేవుళ్లపై జగన్‌కి, వైసీపీ నేతలకు ఏ మాత్రం గౌరవం లేదని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చిరాంప్రసాద్ విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీ పాలనలో హిందూ దేవాలయాలపైన, అర్చకులపైనా దాడులు జరిగాయని, కూటమి పాలనలో ఒక్క ఆలయంపై అయినా దాడి జరిగిందా? అని ప్రశ్నించారు. ఒబెరాయ్ హోటల్‌కు వైసీపీ హయాంలోనే భూములు కేటాయిస్తూ జీవో ఇచ్చారని, కూటమి ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసిందన్నారు.