Non-Creamy Layer Criteria: ఓబీసీ నాన్ క్రీమీలేయర్ అర్హతపై కమిటీ
ABN , Publish Date - Jul 23 , 2025 | 05:44 AM
ఓబీసీల్లో నాన్ క్రీమీలేయర్ అర్హత కలిగిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఓబీసీల్లో నాన్ క్రీమీలేయర్ అర్హత కలిగిన వారిని గుర్తించేందుకు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. కమిటీకి జీఏడీ(సర్వీసులు) ప్రత్యేక ప్రధానకార్యదర్శి చైర్మన్‌గా, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సభ్యునిగా, బీసీ సంక్షేమశాఖ ఎక్స్ అఫిషియో కార్యదర్శిని కన్వీనర్‌గా నియమించింది. ఓబీసీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పేస్కేల్‌ను, వారిలో నాన్ క్రీమీలేయర్ అర్హతను కమిటీ అధ్యయనం చేస్తుంది. జ్యుడీషియల్ అధికారుల పిల్లల నుంచి జిల్లా జడ్జీల పిల్లల వరకు క్రీమీలేయర్ విధానాన్ని ఎలా వర్తింపచేశారన్న విషయాన్ని పరిశీలిస్తుంది. బీసీ వర్గానికి చెందిన మంత్రులు సవిత, సత్యకుమార్, పార్థసారథి, ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ తదితరుల విజ్ఞప్తి మేరకు ఈ కమిటీని నియమించారు.