Business Legacy: నూజివీడు సీడ్స్ చైర్మన్ వెంకటరామయ్య కన్నుమూత
ABN , Publish Date - Sep 23 , 2025 | 06:54 AM
నూజివీడు సీడ్స్ లిమిటెడ్ (ఎన్‌ఎస్ఎల్)చైర్మన్ మండవ వెంకటరామయ్య(94) సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన...
నివాళులర్పించిన మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య
నూజివీడు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): నూజివీడు సీడ్స్ లిమిటెడ్(ఎన్‌ఎ్‌సఎల్) చైర్మన్ మండవ వెంకటరామయ్య(94) సోమవారం కన్నుమూశారు. కొంత కాలంగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుమారుడు, ఎన్‌ఎ్‌సఎల్ ఎండీ ప్రభాకర్‌రావు తెలిపారు. వెంకటరామయ్యకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. బెనారస్ హిందూ విశ్వ విద్యాలయంలో ఎంఎస్సీ చేసి తిరిగి స్వగ్రామం వచ్చిన ఆయన, దేశంలో ప్రైవేటు విత్తన రంగం ప్రారంభమైన సమయం... 1973లో నూజివీడు సీడ్స్‌ను స్థాపించారు. ఆ బాటలోనే ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు సైతం నూజివీడు సీడ్స్‌ను అభివృద్ధి పరుస్తూ అనేక పరిశ్రమలను స్థాపించి వ్యాపారాన్ని విస్తరించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నివాళి
‘వెంకటరామయ్య లేని లోటు తీర్చలేనిది. ఆయన ఆశయ సాధనకు కృషి చేయడమే మనం ఇచ్చే ఘనమైన నివాళి’ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం తుక్కులూరులో వెంకటరామయ్య పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.