Share News

Nandamuri Ramakrishna: ఎన్టీఆర్‌ జనం గుండెల్లో ఉంటారు

ABN , Publish Date - Aug 01 , 2025 | 04:30 AM

సూర్యచంద్రులు, రామా యణ, మహాభారతాలు ఉన్నంతకాలం దివంగత నందమూరి తారక రామారావు జనం గుండెల్లో సజీవంగానే ఉంటారని ఆయన తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు.

 Nandamuri Ramakrishna: ఎన్టీఆర్‌ జనం గుండెల్లో ఉంటారు

  • నందమూరి రామకృష్ణ, టీడీ జనార్దన్‌

  • బళ్లారిలో అన్న క్యాంటీన్‌ సేవలకు అభినందనలు

బళ్లారి, జూలై 31(ఆంధ్రజ్యోతి): సూర్యచంద్రులు, రామా యణ, మహాభారతాలు ఉన్నంతకాలం దివంగత నందమూరి తారక రామారావు జనం గుండెల్లో సజీవంగానే ఉంటారని ఆయన తనయుడు నందమూరి రామకృష్ణ అన్నారు. బళ్లారి కమ్మ మహాజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ సేవలను గుర్తించి, అభినందించేందుకు గురువారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సంఘం బళ్లారి జిల్లా అధ్యక్షుడు ముండ్లూరు అనూప్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టీడీపీ కృష్ణా జిల్లా సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచ దేశాల్లో ఏ నటుడూ నటించలేనన్ని పాత్రలను ఎన్టీఆర్‌ నటించారని, రాజకీయాల్లో తనదైన పాలనతో చరిత్ర సృష్టించారని, తెలుగు బాషను విశ్వవ్యాప్తం చేశారని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రామకృష్ణ పేర్కొన్నారు. బళ్లారిలో ఎన్టీఆర్‌ పేరుతో నిత్యాన్నదానం చేయడం సంతోషకరమని టీడీ జనార్దన్‌ అన్నారు. కార్యక్రమంలో కమ్మ మహాజన సంఘం నాయకుడు కొత్తపల్లి తిమ్మరాజులు, పలువురు టీడీపీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Aug 01 , 2025 | 04:31 AM