Share News

Visakhapatnam : ఎన్‌ఆర్‌ఐ మహిళ మృతి కేసులో వైద్యుడి అరెస్టు

ABN , Publish Date - Mar 11 , 2025 | 06:27 AM

ఈనెల ఆరో తేదీన ఎన్‌ఆర్‌ఐ మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్టు త్రీటౌన్‌ పోలీసులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

 Visakhapatnam :  ఎన్‌ఆర్‌ఐ మహిళ మృతి కేసులో వైద్యుడి అరెస్టు

విశాఖపట్నం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలోని హోటల్‌లో ఈనెల ఆరో తేదీన ఎన్‌ఆర్‌ఐ మహిళ మృతి చెందిన ఘటనకు సంబంధించి ఒకరిని అరెస్టు చేసినట్టు త్రీటౌన్‌ పోలీసులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దశాబ్దాల కిందట అమెరికాలో స్థిరపడిన సీతమ్మధారకు చెందిన 48 ఏళ్ల మహిళను అమెరికాలో స్థిరపడిన మహారాణిపేటకు చెందిన వైద్యుడు పి.శ్రీధర్‌ పరిచయం చేసుకున్నారు.


ఎన్‌ఆర్‌ఐ మహిళ గత నెల 14న, శ్రీధర్‌ 18న నగరానికి వచ్చారు. ఈనెల ఆరో తేదీన శ్రీధర్‌ మేఘాలయ హోటల్‌లో గది బుక్‌ చేసుకుని, ఆమెను అక్కడకు రమ్మనగా వెళ్లారు. అదేరోజు ఆమె హోటల్‌ గది వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై శ్రీధర్‌ను నిందితుడిగా పేర్కొంటూ, అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు. శ్రీధర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Mar 11 , 2025 | 06:28 AM