Haj pilgrimage: ఇక బెజవాడ నుంచే నేరుగా హజ్‌యాత్ర
ABN , Publish Date - Jul 31 , 2025 | 06:47 AM
రాష్ట్రంలోని ముస్లింలు సులువుగా, సునాయాసంగా పవిత్ర స్థలం మక్కాకు చేరుకునే అవకాశం ఏర్పడింది. నేరుగా మక్కాకు చేరుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా...
సీఎంకు వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజీజ్ ధన్యవాదాలు
విజయవాడ సిటీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ముస్లింలు సులువుగా, సునాయాసంగా పవిత్ర స్థలం మక్కాకు చేరుకునే అవకాశం ఏర్పడింది. నేరుగా మక్కాకు చేరుకునేందుకు వీలుగా దేశవ్యాప్తంగా ఎంబార్కేషన్ పాయింట్లు కలిగిన 17 అంతర్జాతీయ విమానశ్రయాల జాబితాలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చోటు దక్కించుకుంది. ఇప్పుడు రాష్ట్రంలోనే ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటుతో హజ్‌యాత్ర చేసే ముస్లింలకు వేలాది రూపాయల డబ్బు, సమయం ఆదా కానున్నాయి. ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు పట్ల సీఎం చంద్రబాబుకు, మంత్రి ఫరూక్‌కు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, హజ్ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.