Share News

Excise Director Nishanth: మిగులు బార్లకు నేడు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Sep 03 , 2025 | 06:11 AM

మిగులు బార్లకు బుధవారం నోటిఫికేషన్‌జారీచేయనున్నట్లు ఎక్సైజ్‌ డైరెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ మంగళవారం ప్రకటించారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని...

Excise Director Nishanth: మిగులు బార్లకు నేడు నోటిఫికేషన్‌

  • 432 బార్లకు 15న లాటరీ

అమరావతి, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మిగులు బార్లకు బుధవారం నోటిఫికేషన్‌జారీచేయనున్నట్లు ఎక్సైజ్‌ డైరెక్టర్‌ నిషాంత్‌కుమార్‌ మంగళవారం ప్రకటించారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని, 15న ఉదయం లాటరీ నిర్వహిస్తారని తెలిపారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా 432 బార్లు మిగిలిపోయాయి. 924 బార్లలో 492 బార్లకు ఇప్పటివరకు లైసెన్సీలు ఎంపికయ్యారు. వాటిలో 80 బార్లు కల్లు గీత కార్మికుల కేటగిరీలో ఉన్నా యి. దరఖాస్తులు తక్కువగా వస్తున్నందున ఈసారి వాటి స్వీకరణకు ఎక్కువ రోజులు గడువు పెట్టారు. సాధారణం గా వారం రోజులు పెట్టే గడువును 12రోజులకు పెంచారు.

Updated Date - Sep 03 , 2025 | 06:12 AM