AP Government: రిటైర్డ్ ఎస్‌ఈసీ ప్రయోజనాలకు నోటిఫికేషన్
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:31 AM
రిటైర్ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు హైకోర్టు మాజీ న్యాయమూర్తి తరహాలో ప్రయోజనాలు కల్పించేందుకు..
రిటైర్ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు హైకోర్టు మాజీ న్యాయమూర్తి తరహాలో ప్రయోజనాలు కల్పించేందుకు మార్గదర్శకాలు విడుదల చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నియమించిన వ్యక్తికి గాని, వారి భర్త/భార్యకు గాని డొమెస్టిక్ హెల్ప్ కింద సర్వెంట్‌ను నియమించుకునేందుకు ప్రభుత్వం రూ.45 వేల మేర ప్రయోజనం కల్పిస్తుంది. దాంతో పాటు మరో రూ.15 వేలు ఫోన్, ఇంటర్నెట్ సేవల కోసం అందజేయనుంది. ఆ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ రూల్స్‌ను విడుదల చేస్తూ ఆదేశాలిచ్చారు.