Share News

Notification Issued for PG Course: పీజీ కోర్సుల మార్పులకు నోటిఫికేషన్‌

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:50 AM

పీజీ కోర్సుల కన్వెర్షన్‌, కొత్త కోర్సులకు అనుమతి, ప్రస్తుత కోర్సుల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తూ ఉన్నత..

Notification Issued for PG Course: పీజీ కోర్సుల మార్పులకు నోటిఫికేషన్‌

అమరావతి, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): పీజీ కోర్సుల కన్వెర్షన్‌, కొత్త కోర్సులకు అనుమతి, ప్రస్తుత కోర్సుల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తూ ఉన్నత విద్యామండలి గురువారం నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రైవేటు కాలేజీలు, ఎయిడెడ్‌ కాలేజీలు ఈ మార్పుల కోసం ఈ నెల 15 నుంచి 21వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపింది. 29 నుంచి వచ్చే నెల 1 వరకు తనిఖీలు చేపట్టి, 6న మార్పులపై ప్రొసీడింగ్స్‌ జారీచేస్తారని తెలిపింది.

Updated Date - Aug 15 , 2025 | 04:50 AM