7 బార్లకు మళ్లీ నోటిఫికేషన్
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:31 AM
జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 7 బార్లకు నోటిఫికేషన్ ను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది. సూపరింటెండెంట్ ఎం. సుధీర్‌బాబు నగరంలోని తన చాంబర్‌లో నోటిఫికేషనకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు.
14వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ.. 15న లాటరీ పద్ధతిలో ఎంపిక
ఇప్పటికే ఖరారైన 19 బార్ల ఏర్పాటుకు ప్రొవిజినల్ లైసెన్స జారీ
కర్నూలు అర్బన్, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 7 బార్లకు నోటిఫికేషన్ ను ఎక్సైజ్ శాఖ జారీ చేసింది. సూపరింటెండెంట్ ఎం. సుధీర్‌బాబు నగరంలోని తన చాంబర్‌లో నోటిఫికేషనకు సంబంధించిన వివరాలను బుధవారం వెల్లడించారు. జిల్లాలోని కర్నూలు-4, ఎమ్మిగనూరు-2, గూడూరు నగర పంచాయతీలో ఒక బారు ఏర్పాటు కోసం ఈనెల 14వ తేది వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 15న జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ చేత లాటరీ ద్వారా ఎంపిక చేయిస్తామని తెలిపారు. జిల్లాలో 26 బార్లకు గానూ 19 బార్లకు మొదటి విడతలో ఖరారు చేసినట్లు తెలిపారు. నిబంధనల మేరకు 6వ వంతు వార్షిక లైసెన్ ్స రుసుం రూపంలో చెల్లించిన వారికి వెంటనే వ్యాపారాలు కూడా మొదలు పెట్టడానికి ప్రొవిషనల్ లైసెన్సు జారీ చేసినట్లు తెలిపారు.