Sattenapalli: రెంటపాళ్ల కేసులో అంబటికి నోటీసులు
ABN , Publish Date - Jul 21 , 2025 | 05:04 AM
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా...
సత్తెనపల్లి, జూలై 20 (ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటన సందర్భంగా రూరల్ పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆదివారం రూరల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. సోమవారం రూరల్ పోలీసు స్టేషన్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు.