Manual Scavengers Act : ఎంఎస్ చట్టం అమలుకు నోడల్ అధికారి నియామకం
ABN , Publish Date - Aug 21 , 2025 | 04:26 AM
రాష్ట్రంలో మాన్యువల్ స్కావెంజర్స్ చట్టాన్ని అమలు చేసేందుకు నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ ..
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మాన్యువల్ స్కావెంజర్స్ చట్టాన్ని అమలు చేసేందుకు నేషనల్ కమిషన్ ఫర్ సఫాయి కర్మచారీస్ (ఎన్‌సీఎ్‌సకే)తో సమన్వయం చేసేందుకు మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ చర్యలు తీసుకుంది. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ను నోడల్ అధికారిగా నియమిస్తూ మున్సిపల్‌శాఖ ఉత్తర్వులు జారీచేసింది. సఫాయి కర్మచారీకి సంబంధించి మాన్యువల్ స్కావెంజర్ నిషేధం, వారి పునరావాస చట్టం, 2013(ఎంఎస్ యాక్ట్, 2013)ను అమలు చేసేందుకు నోడల్ అధికారి చర్యలు తీసుకుంటారు.