Cooperation Commissioner Ahmed Babu: ఖాళీ ఓచర్లపై రైతుల సంతకాలు తీసుకోవద్దు
ABN , Publish Date - Dec 09 , 2025 | 05:33 AM
రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులకు పంట రుణాలు, ఇతర రుణాలు ఇచ్చేటప్పుడు ఖాళీ ఓచర్లు, ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకోవద్దని...
పీఏసీఎస్ సీఈవోలకు సహకార కమిషనర్ ఆదేశాలు
అమరావతి, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతులకు పంట రుణాలు, ఇతర రుణాలు ఇచ్చేటప్పుడు ఖాళీ ఓచర్లు, ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకోవద్దని సహకారశాఖ కమిషనర్ అహ్మద్ బాబు పీఏసీఎస్ సీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ-పీఏసీఎస్ సాఫ్ట్‌వేర్‌లో పూర్తిగా కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ విధానాన్ని నిర్వహించాలని, రోజూ ఆర్థిక నివేదికలు పంపాలని సూచించారు. ఏదైనా తప్పు జరిగితే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. పంట రుణాలు పే ఆర్డర్లు, ఎల్‌టీ రుణాలకు అకౌంట్ పే చెక్కులను మాత్రమే జారీ చేయాలని, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.