Seethampeta Mandal: గిరిజనులకు తప్పని డోలీ మోత
ABN , Publish Date - Aug 11 , 2025 | 04:34 AM
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం చీడిమానుగూడ గిరిశిఖర గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. రాళ్లు తేలిన ఆ మార్గంలో వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు.
ఇంటర్నెట్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం చీడిమానుగూడ గిరిశిఖర గ్రామానికి రహదారి సౌకర్యం లేదు. రాళ్లు తేలిన ఆ మార్గంలో వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఆ ప్రాంతవాసులకు డోలీ మోతలు తప్పడం లేదు. చీడిమానుగూడకు చెందిన సవర ఒబిగోల్ అనే బాలిక రెండు రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. దీంతో ఆదివారం ఆ బాలికను కుటుంబ సభ్యులు, గ్రామస్థులు డోలీ కట్టి.. మూడు కిలోమీటర్లు నడిచి కొండాడ గ్రామానికి చేర్చారు. అక్కడి నుంచి ఆటోలో పాలకొండ చేరుకుని బాలికను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. బాలిక ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరారు.
- సీతంపేట రూరల్, ఆంధ్రజ్యోతి